
ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
చిలకలూరిపేట పట్టణంలోని ఆర్ వి ఎస్ సి వి ఎస్ హై స్కూల్ నందు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా
చిలకలూరిపేట విద్యా సంఘం అధ్యక్షులు తేళ్ళ సుబ్బారావు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మైలవరపు శివానంద కుమార్, జాయింట్ సెక్రెటరీ బేతంచర్ల రామకోటేశ్వరరావు ట్రెజరర్ బచ్చు రామలింగేశ్వర రావు పాల్గొని పిల్లలకు గణతంత్రదినోత్సవ విశిష్టతను గురించి ప్రసంగించారు. అనంతరం ఎస్ కే కే ఎస్ సి వి ఎస్ జూనియర్ కాలేజీ విద్యార్థులు పాల్గొని అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ వి ఎస్ సి వి ఎస్ హై స్కూల్ పాఠశాల సిబ్బంది, ఆర్వీఎస్ సీవిఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూలు పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app