హాలియా పట్టణం లో 75 సంవత్సరాల స్వాతంత్ర వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఫ్రీడం రన్ లో

Spread the love

హాలియా పట్టణం లో 75 సంవత్సరాల స్వాతంత్ర వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఫ్రీడం రన్ లో పాల్గొన్న *ఎమ్మెల్యే నోముల భగత్ *.
సాక్షిత నల్గొండ జిల్లా … : ఈ సందర్భంగా ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ.. భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జాతీయ జాతీయ జెండాలను ఒక్కొక్క జెండాకు 25 రూపాయల చొప్పున ఖర్చు వెచ్చించి చేనేత మర మగ్గాలపై తయారు చేయించి కోటి 20 లక్షల జాతీయ జెండాలను తయారు చేయించి ఉచితంగా పంపిణీ చేసిన గొప్ప నాయకుడు మన సీఎం కేసీఆర్ ని కొనియాడారు.

వజ్రోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మరి ఏ రాష్ట్రం తెలంగాణకు పోటీ ఇవ్వడానికి దరిదాపుల్లో కూడా లేవని ఈ ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ దని ఈ స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ భావితరాల కోసం గొప్ప జ్ఞాపకంగా మిగలాలని కోరారు ఎమ్మెల్యే నోముల భగత్ .

ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ వెంపటి పార్వతమ్మ శంకరయ్య, మాజీ ఎడమ కాలువ వైస్ చైర్మన్ మలిగిరెడ్డి లింగారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్, కమిషనర్ వీరారెడ్డి, సీఐ సురేష్ కుమార్, ఎస్సై క్రాంతి కుమార్, కౌన్సిలర్లు వర్ర వెంకటరెడ్డి, నల్లబోతు వెంకటయ్య, అన్నే పాక శ్రీనువాస్, ప్రసాద్ నాయక్, మండల అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి దోరెపల్లి వెంకన్న, అధికార ప్రతినిధి సురభి రాంబాబు, కో ఆప్షన్ నెంబర్లు రావుల లింగయ్య, ధోనిమిక్,నడ్డి బాలరాజు,బొమ్మిశెట్టి ఆంజనేయులు,ఎడవెల్లి నాగరాజు తదితర ముఖ్య నాయకులు, విద్యార్థినీలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page