
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి స్టేడియంలో సేవా భారతి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 5K , 10K, 21K రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్ కార్యక్రమంలో IT, పరిశ్రమ, వాణిజ్యం మరియు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో కలిసి పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ సేవా భారతి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో 5K , 10K, 21K రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం అని, పెద్ద సంఖ్యలో పాల్గొనడం అభినందనియం అని, బాలికలను సంరక్షించాలని, బాలికల రక్షణనే ధ్యేయంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని, బాలికల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ,మహిళ సాధికారికత సాధించాలని, మహిళల పట్ల వివక్ష నశించాలని ,మహిళలు అన్ని రంగాలలో సమానం అని నిరూపిస్తున్నారు అని ,మహిళలు స్వశక్తి తో ఎదగాలని, మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు. ఇలాంటి అవగహన కార్యక్రమాలను నిర్వహించిన సేవా భారతి సభ్యుల ను , ఈ రన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినదిస్తున్నాను అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక శ్రమ ఎంతో అవసరం అని గుర్తు చేయడం ఈ రన్ ఎంతగానో తోడ్పడుతుంది అని ఎంతో మందికి స్ఫూర్తి గా నిలుస్తుంది అని , వృద్ధులు ,యువత , చిన్న పిల్లలు పాల్గొనడం ఎంతో ఆనందయాకం అని , ప్రతి ఒక్కరు ఆరోగ్యము పట్ల ఎంతో శ్రద్ధ వహించాలని, శారీరక శ్రమ వలన మానసిక ఉల్లాసం ,ప్రశాంతత చేకూరుతుంది అని, మారిన జీవన శైలి లో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాయమం చేయాలని, ఈ రన్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అని ,ఇది ఒక మంచి శుభపరిణామం అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహకురాలు బాల లత, సేవా భారతి నిర్వాహకులు ఉష ,సునీత మరియు తదితరులు పాల్గొనడం జరిగినది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app