
ఘనంగా “మరాఠా యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్” 359వ జయంతి వేడుకలు…
132 – జీడిమెట్ల డివిజన్ హెచ్ఐఎల్ ఏరోనాటికల్ కాలనీ శివాజీ సర్కిల్ వద్ద “మరాఠా యోధుడు చత్రపతి శివాజీ” 359వ జయంతి కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై చత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్,ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ… గెరిల్లా సైన్యంతో శత్రువుల ఊహలకు అందని విధంగా యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శించి మొగల్ పాలకులను ఓడించి, ప్రత్యర్ధులే శివాజీ మహారాజును ఛత్రపతిగా కీర్తించేలా మరాట్వాడా సామ్రాజ్యాన్ని విస్తరించి, నమ్ముకున్న వారికి వెన్నుగా నిలిచిన గొప్ప చక్రవర్తి శివాజీ మహారాజ్ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, కుంటా సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, నరేందర్ రెడ్డి, యేసు, గుమ్మడి మధుసూదన్ రాజు, సమ్మయ్య నేత, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఆటో బలరాం, నదీమ్ రాయ్, కాలే గణేష్, బాల మల్లేష్, శ్రీకాంత్, విజయ్ హరీష్, మహిళా నాయకురాలు శ్రీదేవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app